తెలంగాణలో వ్యతిరేక శక్తులకు అవకాశం ఇవ్వకూడదని పోటీ నుంచీ వైదొలగామన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సంగతి మీకెందుకు… మీ బస్సు యాత్ర ఎందుకు ఆపేశారని, జనసేన, టిడిపి కలిసి పిలుపిచ్చిన బాబు భరోసా భవిష్యత్తు గ్యారెంటీ ని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు బొండా ఉమా. రాష్ట్రంలో గడప గడపకి జనసేన, టిడిపి పాదయాత్ర చేయబోతున్నాయని, రాష్ట్ర స్ధాయిలో సమావేశాలకు చంద్రబాబు, పవన్ కలిసి ఒక డేటు ప్రకటించబోతున్నారన్నారు బొండా ఉమా.
అంతేకాకుండా.. ‘రాబోయే 90 రోజులు టిడిపి జనసేన కూటమి ప్రజల్లో ఉండబోతున్నాయి. ప్రజలందరూ టిడిపి కార్యకర్తలు అని సజ్జల అంటున్నారంటేనే అర్ధమవుతుంది. వైసీపీకి అభ్యర్ధులు లేక మనవడిని, కొడుకుని, డ్రైవరుని పెట్టుకోండి అంటున్నారట. రోజాకి జబర్దస్త్ భాష, అశ్లీల భాష అలవాటు… సజ్జల, రోజ పూజ లాంటి వాళ్ళ మాటలు వాళ్ళే చూసుకోవాలి. ప్రజలు చంద్రబాబు కు స్వాగతం పలకడం వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. కోర్టులో అనేక అవస్తవాలు సీఐడీ లాయర్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రజలకు కృతజ్ఞత తెలుపుకుంటే రాజకీయం చేస్తున్నారు. జనసేన, టిడిపి ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఏదో విధంగా చంద్రబాబు బెయిల్ రద్దుకు వైసీపీ కుట్ర చేస్తోంది. పక్క రాష్ట్ర సీఎం తెలంగాణ ఏపీలాగా అయిపోతుంది అని ఎన్నికల ప్రచారంలో అంటుంటే సిగ్గుపడాలి. సింగిల్ రోడ్డు అయితే ఏపీ, డబుల్ రోడ్డు అయితే తెలంగాణా అని అంటున్నారు పక్క రాష్ట్రంలో. తిరోగమనానికి ఏపీ ఉదాహరణగా చూపిస్తున్నారు’ అని బొండా ఉమా వ్యాఖ్యానించారు.