పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేయాలి : బొండా ఉమ

-

ఏపీలో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అయితే.. ఇప్పటికే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌ వీడియో అంటూ ఓ వీడియో సంచలన రేపుతోంది. దీనిపైనే ప్రధాన ప్రతిపక్ష నేతలు అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఇప్పటికే దీనిపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇచ్చారు కూడా.. అయితేఈ క్రమంలోనే టీడీపీ ఈ వీడియో ఒరిజినల్‌ అంటూ ఓ సర్టిఫికేట్‌ను విడుదల చేసింది. దానిపై ఏపీ సీఐడీ అధికారులు స్పందించి అది ఫేక్‌ సర్టిఫికేట్‌ అని స్పష్టం చేశారు.

Jagan Destroying Amaravati out of Greediness: Bonda Uma

అయితేఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ నాయకుడు బొండా ఉమ డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ సీఎం అయ్యాక పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్ధకమైందని ఆరోపించారు బొండా ఉమ. వరదలు వస్తాయని తెలిసినా సర్కారు నిర్లక్ష్యమేమిటని నిలదీశారు బొండా ఉమ. అవగాహన లేని మంత్రి వల్లే పోలవరం అధ్వానంగా ఉందని వ్యాఖ్యనించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు బొండా ఉమ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news