ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తా నంటూ ఆయన పేర్కొ న్నారు. కరెంట్ తీసేస్తామనటం తప్పు అంటే ఎలా? అని స్పష్టం చేశారు. ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదని.. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం తప్పు అంటే ఎలా అని నిలదీశారు ఏపీ మంత్రి బొత్స సత్య నారాయణ.
గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ అయ్యారు. జప్తు చేయటం మా ఉద్దేశ్యం కాదని.. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయి ? అని నిలదీశారు. ప్రభుత్వం..ప్రజల కోసమే పని చేస్తుందని.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కానీ.. టీడీపీ పార్టీ నేతలు ఈ విషయంలో.. చాలా దుర్మర్గంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎప్పుడు వైసీపీ పార్టీని విమర్శించేందుకు కొన్ని అంశాలను.. తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.