అరే.. నిమ్మగింజల్లో ఇన్ని పోషకాలు ఉన్నాయా.. షాకింగ్ విషయాలు చెప్పిన తాజా పరిశోధనలు

-

ప్రస్తుత కాలంలో డైట్ ఫాలో అయ్యేవాళ్లు..నిమ్మరసం ఎక్కువగా వాడుతుంటారు. జ్యూసుల్లో, రైస్ ఐటమ్స్ లో నిమ్మరసం వాడుతాం..అయితే..పొరపాటున ఆ గింజలు అందులో పడిపోతాయి. చూస్తే తీసేస్తాం..ఒకవేళ చూడకపోతే. పులిహోర లాంటివి తినేప్పుడు నోట్లోకి వెళ్లిపోతుంది. నమలగానే చేదుగా ఉంది అని తినేప్పుడు ఊసేస్తుంటారు. కానీ నిమ్మగింజ చాలా మంచిదట. ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలు తెలిస్తే.. ఇక నిమ్మగింజలను పొరపాటున కూడా పారేయ్యరు.. లివర్ కు ఈ నిమ్మగింజలు చాలా బాగా ఉపయోగపడతాయట. ఈరోజు గింజలు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన కొన్ని విషయాలను చూద్దాం.
నిమ్మగింజలను బాగా నమిలి మాత్రమే మింగాలి. లేదంటే అందులో పోషకాలు ఏమి అందవు..తిన్నగా మోషన్ అయిపోతుంది. 2021వ సంవత్సరంలో యాన్ యాన్ యూనివర్శిటీ చైనా( Yan Yan University – China)వారు నిమ్మగింజల మీద పరిశోధన చేశారు. అనేక అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని వాళ్లు నిరూపించారు. నిమ్మగింజల్లో ఫ్లేవనాయిడ్స్( Flavonoids), శాపనిన్స్( Saponins),
 టానిన్స్(Tannins), అల్కలాయిడ్స్ (Alkalodis) ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉంటాయట. నిమ్మగింజలను తిన్నప్పుడు… లేదా పొడి వాడినప్పుడు లివర్ కు అద్భుతంగా పనిచేస్తుందట. లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి అవసరమయ్యే సూపర్ ఆక్సైడ్ డిస్మిటేస్ , కెటలైస్ ( Superoxide Dismutase SOD , Catalase ) అనే ఎంజైమ్స్ ను నిమ్మగింజల్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ పెంచేట్లు చేస్తున్నాయట.
లివర్ ఫంక్షన్ టెస్ట్ లో SGOT, SGPT అనే టెస్టులు ఉంటాయి. బ్లడ్ లో ఇవి 30-40 లోపు ఉంటే మంచిది. అది దాటి పెరిగింది అంటే..మన లివర్ సెల్స్ ఎక్కువ డామేజ్ అవుతున్నట్లు. ఆల్కహాల్ తాగేవారికి, ఫ్యాటీ లివర్ ఉన్నవారికి, బాగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేవారికి, జాండిస్ వచ్చిన వారికి లివర్ హార్డ్ అయి డామేజ్ అవుతుంది. అప్పుడు SGOT, SGPT లివర్ సెల్స్ నుంచి బయటకు వచ్చి రక్తంలో కలుస్తాయి. దాని వల్ల వీటిశాతం పెరుగుతుంది. దీర్ఘకాలింగా ఇది పెరిగితే.. లివర్ జబ్బులు వచ్చే అ‌వకాశం ఉంటుంది. నిమ్మగింజలు నాలుగు ఐదు తింటే.. SGOT, SGPT లెవల్స్ ను తగ్గిస్తున్నాయట. పొడి చేసుకుని తేనె కలుపుకని నాకేయొచ్చు. కొద్దిగా వాడినా పవర్ ఫుల్ మెడిసినల్ ప్రోపర్టీస్ కలిగి ఉండటం వల్ల మంచి ఫలితాలను ఇస్తుందని సైంటిస్టులు ప్రూవ్ చేశారు.
ఫ్యాటీ లివర్ తగ్గడానికి కూడా నిమ్మగింజలు ఉపయోగపడతున్నాయట. ఇంకా నిమ్మగింజల్లో Epigallocatechine, Caffeic acid, Hesperidin, Quercetin అనే పవర్ ఫుల్ యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీ డీటాక్సిఫికేషన్ కు బాగా హెల్ప్ చేస్తున్నాయని చైనావారు నిరూపించారు.
లివర్ సమస్యలు ఉన్నవారు..రెగ్యులర్ గా నిమ్మగింజల పొడిని ఏదో ఒక రూపంలో వాడుకుంటే.. నాచురల్గా తగ్గించుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు.. మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి పొరపాటున కూడా..ఈసారి నిమ్మగింజలను పారేయకుండా నమిలేయండి బాస్.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news