రణ్‌బీర్‌కపూర్, అలియా జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్రహ్మాస్త్రం’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే, వీకెండ్‌లో మాత్రం ఆ టాక్‌ను దాటుకుని బాక్సాఫీస్ వద్ద కాస్త గట్టిగానే నిలబడింది. 2022లో విజయాలు లేక సతమతవుతున్న బాలీవుడ్‌కు కొంతమేర ఊరటనిచ్చింది. వీకెండ్ వసూళ్ల విషయంలో ఈ చిత్రం 10 రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో చూసేయండి.
- బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కెరీర్‌లో ‘బ్రహ్మాస్త్రం’ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ.36.50 కోట్లు వసూలు చేసింది. గతంలో వచ్చిన సంజూ రికార్డు( రూ.34.75కోట్లు )ను బద్దలు కొట్టింది.
- ‘బ్రహాస్త్రం’ వీకెండ్ కలెక్షన్లు చూసుకుంటే రూ.125.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇది అలియాభట్ నటించిన సినిమాల్లో అతిపెద్ద వీకెండ్ గ్రాసర్. గతంలో ఆమె నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’, ‘కళంక్’ చిత్రాలను ఇది దాటేసింది.
- రణ్‌బీర్‌కు మాత్రమే కాదు, అలియా భట్‌కు కూడా ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ. కళంక్ రూ.21.60కోట్లు రాబట్టగా, ‘బ్రహాస్త్రం’ రూ.36.50కోట్లు వసూలు చేసింది.
- 2022లో బాలీవుడ్‌లో విడుదలైన అత్యధిక చిత్రాలు మెప్పించలేకపోయాయి. కానీ, ‘బ్రహాస్త్రం’కు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ కార్తిక్ ఆర్యన్ ‘భూల్ భూలయ్య2’ అత్యధికంగా రూ.14.11కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డును తిరగరాస్తూ ఈ చిత్రం రూ.36.50కోట్లు వసూలు చేసింది.
- ఇక రణ్‌బీర్ కెరీర్‌లో అత్యధిక వీకెండ్ గ్రాసర్‌గా ‘బ్రహాస్త్రం’ నిలిచింది. రూ. 125.50 కోట్లు వసూలు చేసింది. గతంలో రణ్‌బీర్ నటించిన సంజూ రూ.120.5కోట్లు వసూలు చేసింది.
- ఇక ప్రపంచవ్యాప్తంగా ‘బ్రహాస్త్రం’ వీకెండ్ (సెప్టెంబరు 9-11) కలెక్షన్స్ చార్ట్ చూసుకుంటే రూ.225కోట్లతో చాలా హాలీవుడ్ చిత్రాలను దాటేసింది.
- కరోనా తర్వాత అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగానూ ‘బ్రహ్మాస్త్రం’ నిలిచింది. గతంలో అక్షయ్, కత్రీనా జంటగా నటించిన సూర్యవంశి ఓపెనింగ్ డే కలెక్షన్స్ రూ.26.29 కోట్లు కాగా, బ్రహ్మాస్త్రం రూ.36.50 కోట్లు వసూలు చేసింది.
- ఆస్ట్రేలియాలోనూ ‘బ్రహాస్త్రం’ అదరగొట్టింది. మిలియన్ డాలర్లకు చేరువగా (903k డాలర్లు) వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
- వీకెండ్ ఓపెనింగ్‌లో రూ.100కోట్లు వసూలు చేసిన బాలీవుడ్ చిత్రంగా ‘బ్రహ్మాస్త్రం’ నిలిచింది.
- హిందీలోనే కాదు, ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్న చిత్రంగా ‘బ్రహాస్త్రం’ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది భాషల్లో ఈ చిత్రానికి చక్కని ఆదరణ లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్‌లాంటి తారలందరూ నటించడం, గ్రాఫిక్ హంగులతో ఓపెనింగ్స్ బాగున్నా, లాంగ్‌రన్‌లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది వేచి చూడాలి.