BREAKING : బాలయ్య న్యూ మూవీ టైటిల్ రివీల్… “గ్లోబల్ లయన్”

-

నందమూరి బాలయ్య వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ మధ్యనే మలినేని గోపిచంద్ తో తీసిన వీరసింహారెడ్డి మూవీ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి అనే యంగ్ డైరెక్టర్ తో సినిమాను చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది… కాసేపటి క్రితమే ఈ అప్డేట్ వచ్చింది. నందమూరి బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించేలా చాల ట్రెండింగ్ గా ఈ టైటిల్ ఉంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి “గ్లోబల్ లయన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ చూడగానే మరోసారి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందు తన గర్జన తప్పదేమో అనిపిస్తుంది.

అంత పవర్ ఫుల్ టైటిల్ ను బాలయ్య సినిమాకు పెట్టారు అనిల్ రావిపూడి. ఆయన ఫ్యాన్స్ కు ఏ విధమయిన టైటిల్స్ నచ్చుతాయో అలాంటివే సెలెక్ట్ చేసుకుంటూ సినిమా విజయంలో సగం సక్సెస్ ను అక్కడే కొట్టేస్తున్నారు డైరెక్టర్లు.

Read more RELATED
Recommended to you

Latest news