BREAKING : RGV “మా ఇష్టం” సినిమా విడుదల వాయిదా..

-

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. టాలీవుడ్‌ దర్శకులు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏది చేసినా.. వివాదంలాగే ఉంటుంది.ఇద్ద‌రు అమ్మాయిలు లెస్బియ‌న్‌గా మారితే ఎలా ఉంటుంద‌నే కొత్త క‌థ‌తో ఆర్జీవీ తీశాడు. ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న “డేంజ‌ర‌స్‌ “లో ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నాడు ఆర్జీవీ. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్, ట్రైలర్ అంచ‌నాలు పెంచేశాయి.

ఇక ఈ “డేంజ‌ర‌స్‌ “సినిమా ఏప్రిల్ 8 వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యం లో వర్మ కు షాక్ తగిలింది.”మా ఇష్టం” DANGEROUS సినిమా విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా థియేటర్స్ కోపరేట్ చేయలేని దృష్ట్యా సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేస్తున్నామని వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news