దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వాయిదా పడింది. దేశంలో లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రిలిమ్స్ పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఇది వరకు మే 26, 2024న ప్రిలిమ్స్ ఉంటుందని యూపీఎస్సీ ప్రకటించింది. తాజాగా దాన్ని జూన్ 16, 2024కు వాయిదా వేసింది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను మే 26 నుంచి జూన్ 16కు వాయిదా చేసింది.