పెళ్లిరోజు వధూవరులు ఎంత ఆప్యాయంగా ఉంటారో తెలిసిందే. కానీ కొన్నిసార్లు కొన్ని వింత సంఘటనలు పెళ్లిలో చూడాల్సి వస్తుంది. ఓ పెళ్ళిలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని చిన్న పిల్లల్లా కుస్తీకి దిగారు పెళ్లికూతురు పెళ్ళికొడుకు. క్లిప్ ఆరంభంలో వధువుకు పెండ్లి కొడుకు స్వీట్ పెడతాడు. ఆపై స్వీట్స్ వద్ద పెండ్లి కూతురుకు సమస్య రావడంతో గొడవ స్టార్ట్ అయ్యింది. ఆమె బలవంతంగా వరుడి చేతిని తొలగించడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా లైవ్ రెజ్లింగ్ మ్యాచ్‌లా మారింది.
ఇద్దరూ కుస్తీకి దిగడంతో అతిధులంతా వేదికపైకి వచ్చి వారికి నచ్చచెప్పారు. ఈ వైరల్ వీడియో ను ఘర్‌కెకలేష్ అనే యూజర్ ట్వి్ట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను 1.6 లక్షల మందికి పైగా వీక్షంచారు. వీరు అసలు పెండ్లి చేసుకున్నారా..విడాకులు తీసుకుంటున్నారా అని ఓ యూజర్ సందేహం వ్యక్తం చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారా అని మరో యూజర్ ప్రశ్నించారు. పూర్తి మ్యాచ్‌ను తాను ఎక్కడ చూడాలని మరో యూజర్ అడిగారు. అయితే ఈ వీడియో జరిగిన ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసినదని పలువురు అనుమానిస్తున్నారు.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022