“బ్రో” మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్… “జాణవులే సాంగ్ రిలీజ్” !

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న తమిళ రీమేక్ మూవీ వినోదయ సీతం ను తెలుగులో బ్రో పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముథ్రఖని కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్ మరియు మొదటి సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై ఇవి చాలా ఉత్సాహాన్ని పెంచాయి అని చెప్పాలి. బ్రో చిత్ర బృందం నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరో అప్డేట్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలోని మరో సాంగ్ “జాణవులే…” ను జులై 15వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. మొదటి సాంగ్ లో ఎస్ ఎస్ థమన్ మరోసారి తన బాణీల పవర్ ఏమిటో చూపించాడు.

మరి ఈ సాంగ్ ఎలా ఉంటుంది అని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రకారం బ్రో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జులై 28వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news