కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ర్టానికి లైఫ్‌లైన్‌ ప్రాజెక్ట్‌ : మంత్రి హరీష్‌ రావు

-

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒకమాట మాట్లాడుతున్న కేంద్ర మంత్రులది నోరా.. మోరీనా అని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నదన్నారు మంత్రి హరీశ్‌రావు. దేశాన్నే అబ్బుర పరిచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరుగలేదని పార్లమెంట్‌లో విస్పష్టంగా ప్రకటించిన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.. మంగళవారం బీబీ నగర్‌ వచ్చి.. కాళేశ్వరానికి ఎలాంటి అనుమతులు లేవని, ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు మంత్రి హరీశ్‌రావు. బుధవారం మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు.. కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు.

Harish Rao: డాక్టర్లకు దండం పెట్టిన మంత్రి.. దయచేసి పని చేయండి.. - NTV  Telugu

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు 2017 నవంబర్‌లో అనుమతి ఇచ్చిన వారే.. తెలంగాణకు వచ్చి అనుమతి లేదని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు మంత్రి హరీశ్‌రావు. ఇటీవలే రాష్ర్టానికి వచ్చిన మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు అని.. గ్రోత్‌ ఇంజిన్‌ ఆఫ్‌ తెలంగాణ అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు మంత్రి హరీశ్‌రావు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ర్టానికి లైఫ్‌లైన్‌ ప్రాజెక్ట్‌ అని పేర్కొన్నారు మంత్రి హరీశ్‌రావు. 90 అడుగులు లోతులో ఉన్న నీటిని 600 అడుగుల ఎత్తు వరకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులకు సంబంధించిన జీవోలను మంత్రి హరీశ్‌రావు చదివి వినిపించారు మంత్రి హరీశ్‌రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news