తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి అయిపోయింది..ఇది రాజకీయ ప్రత్యర్ధులు చెప్పే మాటలు. ఒకవేళ పార్టీ పరిస్తితి అయిపోతే..చంద్రబాబు వచ్చి తెలంగాణలో ఒక్క మీటింగ్ పెడితే చాలు అధికార బిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎందుకు విరుచుకుపడతారు. టిడిపిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నప్పుడు..ఆ పార్టీని విమర్శించాల్సిన అవసరం ఉండదు. కానీ విమర్శలు వస్తున్నాయంటే ఎంతోకొంత టిడిపి ప్రభావం ఉందనే చెప్పాలి. 2014 ముందు ఉన్నట్లు ఇప్పుడు తెలంగాణలో టిడిపి పరిస్తితి లేదు.
టిడిపి గట్టిగా ఫైట్ చేస్తే ఒకటి, రెండు సీట్లు మాత్రమే గెలుచుకునే కెపాసిటీ ఉంది..అంటే ఆ పార్టీ 90 శాతం పైనే తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ బలం పెంచుకునే దిశగా వెళుతుంది. ఎన్నికల సమయానికి ఎంత బలం పెంచుకున్నా టిడిపి సత్తా చాటాలేదు. కానీ కొన్ని స్థానాల్లో టిడిపి గెలుపోటములని మాత్రం తారుమారు చేయగలదని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు.
అలా టిడిపి గెలుపోటములని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ తారుమారు చేయగలదు. ఈ ప్రాంతంలో ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఎక్కువ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఏపీలో టిడిపిపై వ్యతిరేకత వల్ల..గ్రేటర్ లో బిఆర్‌ఎస్ పార్టీకి కలిసొచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. ఏపీలో టిడిపికి పాజిటివ్ ఉంది. ఈ ప్రభావం హైదరాబాద్ లో ఉండే పరిస్తితి ఉంది.
ఇక్కడ టిడిపి గెలవడం కష్టమేమో గాని కొన్ని సీట్లలో గెలుపోటములని మాత్రం ప్రభావితం చేయగలదు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఇలా కొన్ని సీట్లలో టిడిపి ప్రభావం ఉంటుంది. అయితే టిడిపి వల్ల అధికార బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టిడిపి ఓట్లు అన్నీ ఆ పార్టీకే వెళ్ళాయి. ఇప్పుడు టిడిపి రేసులోకి వస్తే ఓట్లు చీలి బిఆర్‌ఎస్‌కే నష్టం.