ట్విట్టర్‌ లోగో మార్చేసిన ఎలన్‌ మస్క్‌.. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటే ఇదేనేమో..!!

-

ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ సీఈవో అయినప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి.. మొన్నటివరకూ బ్లూ టిక్‌ పంచాయితీ.. ఇప్పుడు ఇక ఏకంగా లోగోనే మార్చేశారు.. ట్విటర్‌ పిట్ట పోయింది.. ఆ స్థానంలో డాగ్‌ వచ్చింది. పిట్ట పోయి కుక్క రావడం ఏంట్రా అని యూజర్లు అంతా గందరగోళంగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ట్విట్టర్ స్థాపించినప్పటి నుంచి 17 ఏళ్లుగా ఉన్న “పక్షి” లోగో స్థానంలో ఇప్పుడు జపాన్‌లో మూలాలను కలిగి ఉన్న ప్రముఖ కుక్క జాతి అయిన షిబా ఇనుగాను రీప్లేస్ చేశారు.

Twitter అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఓ నీలిరంగు పిట్ట. ఇప్పుడు ట్విట్టర్ హోమ్ పేజీ ఓపెన్ చేయగానే గత కొన్ని గంటల నుంచి మనకి ఓ కుక్క బొమ్మ కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇది ట్విట్టరేనా..లేక ఇంకేదైనానా అని.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ట్విట్టర్ లోగో అయినా నీలిరంగు పక్షిని తొలగించి ఓ ఓ కుక్కను లోగోగా మార్చేశారు..

Twitter బ్లూ బర్డ్ లోగో స్థానంలో సోమవారం సాయంత్రం డాగ్‌కోయిన్ లోగో వచ్చింది. ఇది నెటిజన్లను గందరగోళానికి గురి చేసింది. పక్షి లోగో స్థానంలో జపాన్‌లో మూలాలను కలిగి ఉన్న ప్రముఖ కుక్క జాతి అయిన షిబా ఇనుగాను రీప్లేస్ చేశారు.

కారణం ఏంటి..

అయితే ఈ కుక్క లోగో వెనక ఓ బలమైన కారణం ఉంది. ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ చాలా కాలంగా Dogecoin క్రిప్టో కరెన్సీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తున్నారు. అంతేకాదు తన మైక్రో-బ్లాగింగ్ ట్విట్టర్‌లో క్రిప్టోకరెన్సీని ప్రోత్సహించడం గమనార్హం. మరోవైపు ట్విట్టర్ లోగోగా Dogecoin మస్కట్‌ను చేర్చడం వలన మార్కెట్లో Dogecoin టోకెన్ ధర భారీగా పెరిగింది. CoinGecko ప్రకారం..Dogecoin సోమవారం 20 శాతం పైగా పెరిగి $0.092కి చేరుకుంది.

కారణాలు ఏమైనప్పటికీ.. ఇప్పుడు ఈ కుక్కబొమ్మ తెగ వైరల్‌ అవుతుంది. నెటిజన్లకు ముందు నుంచే ఈ కుక్కబొమ్మ పరిచయం.. మీమర్స్‌ ఇక ఈ కుక్కబొమ్మతో తెగ మీమ్స్‌ వేస్తున్నారు..చింటుగాడి రేంజ్ పెరిగిందంటూ కమెంట్స్ చేస్తున్నారు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అనే సామెత ఈరోజు నిజంగా నిజం అయింది.. ఈ కుక్కకు ఈరోజు వచ్చేసింది అంటున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news