మంత్రుల క్వార్టర్ల ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి నేతల యత్నం..

-

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో గల తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు లీడర్లు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను త్వరగా భర్తీ చేయాలని మంత్రుల ఇళ్ల ముట్టడికి బీఆర్ఎస్ నేతలు యత్నించారు.

బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తెలంగాణ భవన్ ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంత్రుల ఇళ్ల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను, విద్యార్థులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వెంటనే రాష్ట్రంలోని మెడికల్ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version