ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే బిఎస్పి మద్దతు

-

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ దన్కడ్ ను బిజెపి అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్కడ్ కు మద్దతిస్తున్నట్లు బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ద్రౌపది ముర్ము కి మద్దతు ఇచ్చారు మాయావతి. ఇప్పుడు ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను కాంగ్రెస్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు జగదీప్.

1989 లో లోక్సభ ఎన్నికల్లో ఝుంఝు నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. 2019 జూలైలో జగదీప్ పశ్చిమబెంగాల్ గవర్నర్ గా నియమించబడ్డారు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ను బిజెపి అధిష్టానం ఎంపిక చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news