కొడాలి నాని పిచ్చికుక్క.. దమ్ముంటే రా తిట్టుకుందాం : బుద్ధ వెంకన్న

-

కొడాలి నాని పిచ్చి కుక్క అంటూ మండిపడ్డారు బుద్దా వెంకన్న. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి‌ చనిపోయారని.. చంద్రబాబు బాధ్యతగా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారన్నారు. సీఎంగా ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా ఆర్ధిక సాయం చేయడం‌ చంద్రబాబు నైజమని.. అసెంబ్లీలో మదమెక్కిన పిచ్చి కుక్కలా కొడాలి నాని వాగుతున్నాడని మండిపడ్డారు.

budda venkanna

చంద్రబాబు సాయాన్ని కూడా తప్పు పట్టడానికి నానికి సిగ్గుండాలని.. అతనికి సంబంధించిన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దూషిస్తున్నారని అగ్రహించారు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే వాగుతున్నాడని.. అంతమంది చనిపోతే సాయం చేయాల్సిన ప్రభుత్వం విమర్శలు చేస్తుందన్నారు, పిచ్చి కుక్కను అందలమెక్కించి నాడు చంద్రబాబు తప్పు చేశారని.. చంద్రబాబు దగ్గర బీఫాం తీసుకుని కొడాలి గెలవలేదా..? అని నిలదీశారు.

కుక్కకు ఉన్న విశ్వాసం కూడా కొడాలికి లేదు.. నోరేసుకుని పడితే.. జగన్ మంత్రి పదవి ఉంచుతాడనే భ్రమలో ఉన్నాడని ఫైర్ అయ్యారు. నువ్వేంట్రా చంద్రబాబు అంతు‌ చూసేది.. అంత దమ్ముందా..? లోకేష్, అచ్చెన్నాయుడులను తిడతావా.. ఎవడ్రా నువ్వు..? అంటూ మండిపడ్డారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version