బ్లాక్ పేపర్, ఛానలో వార్తలు చూస్తుంటే నవ్వొస్తోంది.. బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్య‌లు..!

-

చంద్రబాబు పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడిందని… బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే రూ. 10 లక్షల కోట్లయినా దొరుకుతాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి కౌంట‌ర్ ఇచ్చారు బుద్దా వెంకన్న. దో నెంబర్ దందాతో నడిచే బ్లాక్ పేపర్, బ్లాక్ ఛానల్ లో ఐటీ దాడులకు సంబంధించిన వార్తలను చూస్తుంటే నవ్వొస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా చంద్రబాబు హయాంలోనే ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టారని చెప్పారు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలు మాత్రమేననే విషయం అర్థమవుతోందని అన్నారు.

40 చోట్ల ఐటీ రెయిడ్స్ జరిగితే దొకింది కేవలం రూ. 87 లక్షలు మాత్రమేనని చెప్పారు. ‘మూడు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా దాడి చేశామని ఐటీ అధికారులు ప్రకటన ఇచ్చారు. బోడి గుండుకి, మోకాలికి ముడి పెట్టినట్టు… ఇన్ఫ్రా కంపెనీల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని ఐటీ అధికారులు అంటే… చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికేశాయని వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ ను చదవడం వచ్చిన వాళ్లతో చదివించుకోవాలని కోరుతున్నానని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news