ఎద్దుకు జైలు శిక్ష.. విషయం అలాంటిది మరీ..

-

ఓ కేసులో పోలీసులు ఎద్దును అరెస్ట్‌ చేయగా కోర్టుకు దానికి శిక్ష విధించగా.. అదేంటి అనుకుంటున్నారా..? విషయం అలాంటిది మరీ.. ఒక పన్నెండేళ్ల పిల్లాడిని చంపిన కేసులో పోలీసులు చేసిన అరెస్టు వైరల్‌గా మారింది. ఎందుకంటే వాళ్లు అరెస్టు చేసింది మనిషిని కాదు.. ఒక ఎద్దును. ఈ ఘటన దక్షిణ సూడాన్‌లో జరిగింది. ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్దు.. ఉన్నట్లుండి పిల్లాడిపై దాడి చేసింది.water buffalo | mammal | Britannica

 

ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. దీని గురించి మాట్లాడిన పోలీసులు.. ‘‘ఆ ఎద్దును అరెస్టు చేసి రూంబేక్ సెంట్రల్ కౌంటీ పోలీస్ స్టేషన్‌లో ఉంచాం. పిల్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాం. అది పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబానికి అప్పగించేశాం’’ అని వెల్లడించారు. ఇక్కడి చట్టాల ప్రకారం, ఎద్దుకు జైలు శిక్ష ముగిసిన తర్వాత.. దాన్ని బాధితుల కుటుంబానికి అప్పగిస్తారు. ఇదిలా ఉంటే.. అలాంటి ఎద్దును నిర్లక్ష్యంగా జనంపైకి వచ్చేలా వదిలిన ఎద్దు యజమానుల సైతం శిక్షించాలని కొందరు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news