బిజినెస్ ఐడియా: పెట్టుబడి తక్కువ, శ్రమ తక్కువ.. లాభాలు మాత్రం ఎక్కువే..!

-

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ వ్యాపారాల పై దృష్టి పెట్టారు. ఉద్యోగాలని కూడా వదిలేసుకుని వ్యాపారాలని చేస్తున్నారు. వ్యాపారాల వల్ల అదిరే లాభాలని ఈ మధ్యకాలంలో చాలా మంది పొందుతున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నట్లయితే ఈ ఐడియా ని చూడండి. ఈ ఐడియా ని అనుసరించడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. పెట్టుబడి తక్కువే శ్రమ తక్కువే. లాభాలు మాత్రం ఎక్కువ. మరి ఇంక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చూసేద్దాం.

తులసి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మందులలో కూడా తులసిని వాడుతూ ఉంటారు తులసి సాగుతో చక్కటి లాభాలని పొందొచ్చు. తులసి మొక్కల ద్వారా లక్షాధికారి అయిపోవచ్చు. తులసి మొక్కలను పెంచడం ద్వారా సులభంగా లాభాలని పొందడానికి అవుతుంది ఎక్కువ పెట్టుబడి అక్కర్లేదు అలానే ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు.

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించడంపై దృష్టి పెట్టారు తులసికి డిమాండ్ పెరిగింది కాబట్టి దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. జూలై నెలలో తులసి సాగును ఎక్కువమంది చేస్తూ ఉంటారు. సాధారణ మొక్కను 45*45 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. అయితే మీరు తులసి జాతిని బట్టి వాటిని నాటాలి గుర్తు పెట్టుకోండి.

ఈ మొక్కలు నాటిన తర్వాత నీటిపారుదులు అవసరం. తగిన సమయంలో మీరు వాటికి నీటిని అందిస్తూ ఉండాలి తులసి మొక్క పెరిగిన తర్వాత కోయడానికి 10 రోజులు ముందు మీరు నీటి పారుతులని నిలిపివేయాలి. ఈ మొక్కలు పుష్పించే సమయంలో కోయాల్సి ఉంటుంది. మీరు మార్కెట్ ఏజెంట్ ని సంప్రదించి వీటిని అమ్మొచ్చు లేదంటే కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్న ఫార్మసిటికల్ కంపెనీలు లేదా ఏజెన్సీలకు కూడా అమ్మొచ్చు.

దీనికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది సో కంగారుపడక్కర్లేదు కేవలం 15 వేల రూపాయలతో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. దాదాపు పంటకు మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు వస్తుంది. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే చక్కటి లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version