బిజినెస్ ఐడియా: బెల్లం పొడి తో అదిరే లాభాలు.. పెద్దగా శ్రమపడక్కర్లేదు..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఎక్కువ శ్రమపడక్కర్లేకుండా కొంచెం సమయం కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. గృహిణులు కూడా ఇంటి పనులు చేసుకుంటూ కాస్త సమయాన్ని ఈ బిజినెస్ కోసం వెచ్చిస్తే లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఈమధ్య కాలం లో ప్రతి ఒక్కరూ పంచదారని ఉపయోగించడం మానేసి బెల్లం పొడిని ఉపయోగిస్తున్నారు బెల్లం పొడి బిజినెస్ ద్వారా మీరు చక్కటి లాభాలని పొందొచ్చు.

కెమికల్స్ ఉండే పంచదారని ఉపయోగించడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని అందరూ ఆర్గానిక్ బెల్లం పొడిని వాడుతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు. చెరుకు రసం తయారు చేసిన బెల్లం పానకంలో ఎలాంటి రసాయనాలు కలపరు. గడ్డకట్టించి బెల్లంగా దాన్ని మారుస్తారు. ఇది బెల్లం పొడి రూపంలో కూడా మనకి అందుబాటులో ఉంటుంది.

బెల్లం పొడి ని ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి క్యాష్ చేసుకోండి. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోచించక్కర్లేదు. రైతులే ఈ బెల్లం పొడిని తయారు చేస్తూ ఉంటారు వారి దగ్గర నుండి మీరు హోల్ సేల్ లో తక్కువ రేటుకి కొనుగోలు చేయొచ్చు ఈ బెల్లం పొడి ధర కిలో 50 నుండి 60 రూపాయలు ఉంటుంది. క్వింటాల్ లెక్కని మీరు కొంటే తక్కువ ధర కి మీరు కొనుగోలు చేయొచ్చు.

క్వింటాల్ బెల్లం పొడి ఐదు వేలకే దొరుకుతుంది దీన్ని మీరు సేల్ చేసి మంచిగా లాభాలని పొందొచ్చు. ఒక కేజీ బెల్లం పొడి మార్కెట్లో 85 రూపాయల వరకు ఉంటుంది. మీరు తక్కువ ధర కి రైతులు వద్ద కొనుగోలు చేసి మార్కెట్లో ఎక్కువ కి అమ్మొచ్చు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా కావాలి. ప్యాకింగ్ కోసం మిషిన్ అవసరమవుతుంది కావాలంటే మీరు ఒక బ్రాండ్ నేమ్ తో దీనిని సేల్ చేయొచ్చు. ఈ బిజినెస్ టిప్స్ కోసం మీరు ఏదైనా యూట్యూబ్ లో చూసి తెలుసుకోవచ్చు. ఇలా ఈ బిజినెస్ ద్వారా చక్కటి లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news