ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువ మందికి శ్వాస సమస్యలే వస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అంతా పల్స్ ఆక్సీమీటర్లను కొంటున్నారు. ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటి కప్పుడు చూసుకోవచ్చని, తక్కవ ఉంటే సీరియస్ కాకముందే డాక్టర్ వద్దకు వెళ్లొచ్చని ఆలోచిస్తున్నారు.
ఈ ఆలోచన మంచిదే.. కానీ ఇక్కడ పల్స్ ఆక్సీమీటర్ గురించి అందరికీ తెలియదు. కాబట్టి దాని గురించి మీకు మేము వివరిస్తాం. దీన్ని వాడాలంటే వ్యక్తి వేలికి ఆక్సీమీటర్ ను క్లిప్ లాగా ఉంచాలి. అప్పుడు అది శరీరంలో ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉందో తెలుపుతుంది. 95శాతం కన్నా దీని రీడింగ్ ఎక్కువగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఒకవేళ 92 లేదా 93ఉంటే వెంటనే డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.
ఇది మనచేతి వేలికి పెట్టి ఉంచగానే.. మన గుండె నుంచి రక్త నాళాల ద్వారా ఏయే భాగాలకు ఎంత మోతాదులో ఆక్సిజన్ వెళ్తుందో అంచనా వేసి రీడింగ్ చూపిస్తుంది. కాబట్టి దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుని ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ఇది ఏ మెడికల్ షాపులో అయినా దొరుకుతుంది. దీన్ని వాడటం చాలా సులభం. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.