మొదలైన మంత్రివర్గ సమావేశం… రేవంత్ సర్కార్ నిర్ణయాలపై ఉత్కంఠ

-

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశమైంది.

రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు, కటాఫ్ డేట్, విధివిధానాల రూపకల్పన, అర్హులైనవారి గుర్తింపు, రైతు భరోసా విధివిధానాలు,పీఎం కిసాన్ యోజన నిబంధనల వర్తింపు, ఆంక్షల విధింపు, పంటల భీమా, మద్దత ధర పెంపు వంటి రైతు సంక్షేమ అంశాలే అజెండాగా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగ సభలలో చెప్పిన నేపథ్యంలో కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో మంత్రులు, ప్రధాన కార్యదర్శి, అన్ని విభాగాల హెచ్‌వోడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version