కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. వీటి వలన ఎన్నో లాభాలను పొందొచ్చు. సామాన్యుల నుంచి రైతుల వరకు ఈ స్కీమ్స్ తో చక్కటి లాభాలను పొందేందుకు అవుతోంది. అలానే ఆడపిల్లలకి కూడా కేంద్రం స్కీమ్స్ ని ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్ల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ని తీసుకొచ్చింది. ఇక సీనియర్ సిటిజన్ల స్కీమ్ గురించి పూర్తి వివరాలను చూస్తే..
ప్రధాన మంత్రి వయో వందన యోజన పథకం:
సీనియర్ సిటిజన్స్ కోసం ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ పథకం ని తీసుకు వచ్చారు. ఈ స్కీమ్ వలన నెల నెలా పెన్షన్ ని పొందొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనిని నిర్వహిస్తోంది. ఈ స్కీమ్ ని పొందాలంటే భార్యాభర్తలిద్దరికీ 60 సంవత్సరాలు దాటాలి. గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవుతుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ స్కీమ్ లో చేరచ్చు.
ఇది వరకైతే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అయ్యేది కాదు. కేవలం రూ.7.5 లక్షల వరకు మాత్రమే అయ్యేది. 7.40 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. భార్యాభర్తలిద్దరూ చేరి రూ.15 లక్షలు కట్టాలి. అంటే ఇద్దరికి రూ.30 లక్షలు. నెలకు రూ.18,500 పెన్షన్ వస్తుంది.
అదే ఒకరే చేరి రూ.15 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రూ.1,11000 అవుతుంది. నెలకు రూ.9,250 పెన్షన్ అందుకోవచ్చు. ఈ స్కీమ్ కాలపరిమితి 10 ఏళ్లు. త్రైమాసికం, ఆరు నెలలు, వార్షిక పద్దతిలో పెన్షన్ ని పొందొచ్చు.