జనవరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి లో తన రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆ పార్టీ వర్గాలు దీనిని ధ్రువీకరించాయి. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ఈ పాదయాత్రను అక్టోబర్ నుంచే ప్రారంభించాలనుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో చేపడితే బాగుంటుందనే కారణంతో వచ్చే ఏడాది జనవరికి దీనిని వాయిదా వేసినట్లు సమాచారం.

మొత్తం 450 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జనవరిలో ప్రారంభమై 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేవరకు ఈ యాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ ను తీర్చిదిద్దుతున్నారు. ఈ పాదయాత్రను చిత్తూరు జిల్లాలో ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని లోకేష్ ప్రాథమికంగా నిర్ణయించారని చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. విరామం లేకుండా వారంలో మొత్తం ఏడు రోజులు యాత్ర చేయాలని లోకేష్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news