LIC: ఈ పాలసీని ఒక్కసారి తీసుకుంటే.. ఏటా రూ.55 వేలు పొందొచ్చు…!

-

ఈ మధ్య కాలంలో ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. అయితే ఇలా స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడం వలన మంచిగా లాభాలను పొందొచ్చు. పైగా ఏ రిస్క్ కూడా ఉండదు. దేశంలోని దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చక్కటి లాభాలను మనం పొందొచ్చు.

LIC
LIC

పైగా ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఈ స్కీమ్ పేరు సరల్ పెన్షన్ యోజన. ఇందులో చేరితే ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. అయితే ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చెయ్యాలి. 40 ఏళ్ల నుంచే డబ్బులు పొందొచ్చు. జీవితాంతం పెన్షన్ వస్తుంది. సరల్ పెన్షన్ యోజన అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్. అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాతి నుంచి పెన్షన్ వస్తుంది.

పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ డబ్బులు వస్తాయి. మరణించిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన డబ్బులను నామినీకి ఇచ్చేస్తారు లేదంటే పాలసీదారుడికి పెన్షన్ వస్తుంది. వీరి మరణం తర్వాత భాగస్వామికి పెన్షన్ చెల్లిస్తారు. భాగస్వామి కూడా మరణిస్తే ఇక ఎవరికీ పెన్షన్ రాదు. ఏదైనా పాలసీదారులు ఎంపిక చేసుకోచ్చు. ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా ఈ పాలసీ తీసుకోచ్చు లేదంటే ఆన్ లైన్ లో అయినా సరే తీసుకోచ్చు.

ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం 40 ఏళ్లు ఉండాలి. అలాగే 80 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు తీసుకోచ్చు. ఇక పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనేది చూస్తే.. ప్రతి నెలా పెన్షన్ తీసుకోవచ్చు. లేదంటే మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున కూడా తీసుకోచ్చు. ఇక డబ్బులొస్తాయి అంటే నెలకు కనీసం రూ.1000 నుంచి పెన్షన్ వస్తుంది.

అంటే నెలకి రూ. 12 వేల కనీస పెన్షన్ వస్తుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీకు ఉదాహరణకి 60 ఏళ్లు ఉంటే మీరు రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. మీకు ఏడాదికి రూ.56,450 పెన్షన్ వస్తుంది. సింగిల్ లైఫ్ ఆప్షన్‌కు ఇది వర్తిస్తుంది. అదే జాయింట్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.55,950 పెన్షన్ వస్తుంది. లోన్ ని కూడా తీసుకోచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news