ఆరోగ్యానికి పండ్లు చాలా మంచివి. పండ్లను తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. పైగా పండ్ల లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరూ డైట్ లో కచ్చితంగా పండ్లను చేర్చుకోవడం మంచిది. పండ్ల తో పాటుగా కూరగాయలు ఆకుకూరలు వంటివి కూడా మీరు డైట్ లో తీసుకుంటూ ఉండండి.
అయితే చాలా మందిలో పండ్లకు సంబంధించి ఉండే సందేహం ఏమిటంటే ఉదయం పరగడుపున పండ్లను తీసుకోవచ్చా..? ఏ ఆహారం తీసుకోకుండా మొట్టమొదట పండ్లను మనం తీసుకోవచ్చా..? మరి తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నిజానికి పండ్ల వలన చక్కటి ప్రయోజనాలు ఉన్నాయి కానీ పరగడుపున పండ్లు తింటే చాలా మందికి పడదు. పలు రకాలు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అసలు పండ్ల తిన్న వెంటనే ఏం జరుగుతుంది..?
పండ్లు తిన్న వెంటనే ఏమవుతుందంటే పండ్ల లో ఉండే రసాయనాలు ఎంజైమ్స్, ఆసిడ్స్ మన పేగుల్లోని బ్యాక్టీరియాతో కలిసినప్పుడు ఒక చర్య జరుగుతుంది ఈ కారణంగా కొందరిలో ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది కొందరిలో ఇవి కలగవు.
ఎవరు ఉదయాన్నే పండ్లను తినకూడదు:
గ్యాస్
జలుబు
దగ్గు
అలర్జీలు
శ్వాసకోశ సమస్యలు
సైనస్
బ్రాంకటీస్
ఆస్తమా
అధిక బరువు సమస్య
మధుమేహం తో బాధపడేవాళ్లు పండ్లను అసలు ఉదయాన్నే పరకడుపున తినకూడదు.
కానీ వీళ్లు తీసుకుంటే మంచిదే:
పొడి చర్మం
మలబద్ధకం సమస్య
బలహీన జీవక్రియలు
బలహీన జీర్ణశక్తి ఉన్నట్లయితే పరగడుపున పండ్లు తీసుకోవడం మంచిది.
ఈ తప్పుని చెయ్యద్దు:
అయితే పండ్లను తీసుకున్నప్పుడు పండ్లను మాత్రమే తినాలి. వాటిని కూరగాయలతో కానీ పాల పదార్థాలు లేదంటే పప్పులు వంటి వాటితో తీసుకోకూడదు. మిగిలిన పండ్లతో కానీ డ్రై ఫ్రూట్స్ తో కానీ మీరు తీసుకోవచ్చు. ఉదయం ఏడు నుండి 11 గంటల మధ్య డిటోక్సిఫికేషన్ జరుగుతుంది. పండ్లు తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా శక్తి అందుతుంది జీవక్రియలు స్పీడ్ అవుతాయి.