అభ్యర్థులకు అలర్ట్.. నేడే ఏఈఈ రాతపరీక్ష.. ముఖ్య సూచనలివే

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి జనవరి 22న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. OMR విధానంలోనే పరీక్ష జరుగనుంది. 22న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌- 2 పరీక్ష నిర్వహించనున్నారు.

పేపర్-1 పరీక్షకు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. గేట్లు మూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో; పేపర్-2 ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఇప్పటికే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

అభ్యర్థులకు సూచనలు..

* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పేపర్-1కి ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. అంటే అభ్యర్థులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు పరీక్ష హాలులో ఉంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు.

* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.

* పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అనుమతించరు. ఎవరైనా అభ్యర్థులు దీనిని తీసుకుంటే వారు డిబార్ చేయబడతారు.

* అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన పరీక్ష నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. వాటిని అనుసరించాలి.

* చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం ఎక్కడుందో వెతకడం కంటే ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.

* హాల్‌టికెట్‌పై ఫోటో స్పష్టంగా లేని, ఫోటో చిన్నదిగా ఉన్న, ఫోటో లేకుండా, సంతకం లేని అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి. గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్‌తోపాటు అండర్‌టేకింగ్‌ తీసుకోవాలి. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి. లేకుంటే పరీక్షకు అనుమతించరు.

 

Read more RELATED
Recommended to you

Latest news