కెనడా సింగర్ శుబ్ నీత్ సింగ్ లైవ్ షో క్యాన్సిల్… అమౌంట్ రిఫండ్ !

-

కెనడా మరియు ఇండియా ప్రభుత్వాలకు ఒక విషయంలో వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. కెనడాలో ఖళీస్థాన్ ఉద్యమం కారణంగానే ఇదంతా జరుగుతోందని తెలిసిందే. కాగా ఈ ఉద్యమం కారణంగా తాజాగా ఇండియాలోని ముంబై లో జరగాల్సిన ఒక లైవ్ షో రద్దు అయింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కెనడా కు చెందిన సింగర్ శుబ్ నీత్ సింగ్ ఒక కన్సర్ట్ కోసం ముంబై లో లైవ్ షో ఇవ్వాల్సి ఉంది. అయితే శుబ్ నీత్ సింగ్ కెనడాలో ఉన్న ఖాళీస్తాన్ ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇతను పెట్టిన పోస్ట్ మూలంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది . దీనితో వెంటనే శుబ్ నీత్ సింగ్ ప్రోగ్రాం ను క్యాన్సిల్ చేసి షాక్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఇప్పటికే ఈ షో ను తిలకించడానికి టికెట్ లు కొన్న అందరికీ అమౌంట్ ను రిఫండ్ చేస్తమని ప్రకటించడం జరిగింది. కాగా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఇతన్ని ఫాలో చేస్తుండగా, ప్రస్తుతం అన్ ఫాలో చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version