టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన నటనతో, మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నాగచైతన్య. ఇకపోతే తన భార్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకుపోతున్నారు. ఇటీవల ఈయన నటించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇకపోతే ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే నాగచైతన్య ప్రస్తుతం వార్తల్లో నిలుస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి నాగచైతన్య చేసిన కొన్ని కామెంట్స్ మరొకసారి ఆయనను వార్తలోకి తీసుకొచ్చాయి.ఇకపోతే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా పై తన అభిప్రాయాన్ని చెబుతూ కుండబద్దలు కొట్టేశారు నాగచైతన్య. తాను సోషల్ మీడియా నుంచి డిస్ కనెక్ట్ అయ్యానని నాగచైతన్య తెలిపారు. అయితే తాను ఆన్లైన్ లో చాలా బోరింగ్ ఫీల్ అవుతుంటానని తెలిపారు. ఇక అదే విధంగా తన సినిమా విడుదల అవుతున్నప్పుడు ఆ చిత్రం గురించి పోస్ట్ చేయడం కంటే ఎక్కువగా ఆ సినిమా టాపిక్స్ చదివేందుకు ఆసక్తి చూపిస్తాను. సోషల్ మీడియా సందేశాల్లో ఫిల్టర్ చేసి మంచి ఏది.. చెడు ఏది.. అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని నాగచైతన్య తెలిపారు.
అలా గుర్తించలేక పోతే సోషల్ మీడియా ఏమాత్రం మంచిది కాదని, మిమ్మల్ని అది చెడు మార్గంలో తీసుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక అన్ని విషయాల్లో లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మానసిక ఆరోగ్యానికి మేలు కాదని గమనించి.. సోషల్ మీడియా నుంచి డిస్ కనెక్ట్ అయ్యాను అని చైతన్య తెలిపారు.