మనం జీడిపప్పుని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాము. పైగా జీడిపప్పులు ఫ్రై చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. అయితే దీని వల్ల కేవలం నుంచి మాత్రమే వస్తుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి లభిస్తాయి. మరి ఆలస్యం ఎందుకు జీడిపప్పు వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే చూసేయండి.
గుండె ఆరోగ్యానికి మంచిది:
ఇతర నట్స్ తో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. దీనిలో వుండే ఒలిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. కొవ్వు పదార్థాలు తక్కువగా మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం మూలాన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
బరువు తగ్గిస్తుంది:
జీడిపప్పు లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు దీనిలో ఉంటాయి. జీడిపప్పు తినని వారితో పోలిస్తే వారం లో రెండు సార్లు తినేవారు బరువు తగ్గుతారట.
జుట్టు ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:
జుట్టు నల్లగా ఉండాలి అంటే జుట్టు కి కాపర్ చాలా అవసరం. కాపర్ కలిగిన జీడిపప్పును తినడం వల్ల నల్లటి జుట్టు మీ సొంతమవుతుంది. నెరిసిన జుట్టుకు కూడా జీడిపప్పును తినడం వల్ల తగ్గించవచ్చు.
కండరాల ఆరోగ్యం:
జీడిపప్పు లో మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఇది కండరాల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. అలానే ఇది అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అలానే ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం వంటి మూలికలు జీడిపప్పు లో అధికంగా ఉన్నాయి.
కనుక జీడిపప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం కూడా జీడిపప్పును తీసుకోవడం వల్ల తగ్గుతుంది. చూశారా జీడిపప్పు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..! మరి ఈ ఆరోగ్యకరమైన నట్స్ ని మీ డైట్ లో చేర్చి మరెంత ఆరోగ్యంగా వుండండి.