యూకే పర్యటనకు అనుమతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఫ్యామిలీ వెకేషన్ కోసం లండన్‌కు వెళ్లాలని అనుమతి ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు తన కూతురు దగ్గరకు వెళ్లాని జగన్ కోరారు. అయితే జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ రోజు సీబీఐ వాదనలు వినిపించింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని కోర్టుకు విన్నవించింది. వాదనల అనంతరం విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. మరోవైపు యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఈ రోజు వాదనలు ముగిశాయి. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ… కోర్టును కోరింది. ఈ రోజు వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.