సంచలన రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు తీసుకుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా దర్యాఫ్తు సంస్థ సీబీఐ బృందం మరోసారి పులివెందులకు వెళ్ళింది. అధికారులు తొలుత వైఎస్ వివేకా నివాసానికి వెళ్లారు. అక్కడ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత సీబీఐ బృందం ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి వెళ్లింది. అవినాశ్ రెడ్డి పీఏ రమణారెడ్డితో మాట్లాడారు. అలాగే వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాతోను మాట్లాడారు. సీబీఐ సిట్ బృందం అధికారులు పులివెందులకు వెళ్లారు.
వైఎస్ వివేకా హత్య స్థలంలోని బాత్రూమ్, బెడ్రూమ్ ప్రాంతాలను పరిశీలించారు. అటు తర్వాత వివేకా ఇంటి నుండి బయటకు వచ్చి సమీపంలోని అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇంటి పరిసరాలను పరిశీలించారు. అవినాశ్ రెడ్డి ఇంటిని పరిశీలించాక తిరిగి వివేకా ఇంటికి వచ్చి, హత్య జరిగిన ప్రాంతాన్ని చూశారు. హత్య జరిగిన రోజున, సమయంలో ఎవరెవరు ఉన్నారో ఆరా తీశారు. అవినాశ్ రెడ్డి ఇంటి నుండి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చునో సాంకేతిక ఆధారాలు సేకరించారు.
కాగా అవినాశ్ రెడ్డి చెబుతోంది నిజమే కాదో నిర్ధారణ చేసుకునేందుకు, అతడి పీఏను సీబీఐ అధికారులు పులివెందుల రింగ్ రోడ్ వద్దకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.