జ‌గ‌న్ ది పైశాచిక ఆనందం..జూనియ‌ర్ కిమ్ లా చేస్తున్నాడు : చంద్ర‌బాబు సెటైర్లు

-

జ‌గ‌న్ పై మ‌రోమారు టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని… జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ ప్రకటనలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని నిప్పులు చెరిగారు. జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని సెటైర్లు పేల్చారు చంద్ర‌బాబు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని…
ధరల నియంత్రణలో జగన్ విఫలమయ్యారని ఆగ్ర‌హించారు. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల మయం చేశారు.. పుట్టే ప్రతి బిడ్డ పైనా అప్పు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించడంతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారని… పంచాయతీల నిధులు దారి మళ్లించారు.. జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం నమ్మే పరిస్థితి లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ భూములు అమ్మడమనేది డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగం కాదని, బిల్డ్ ఏపీ కేసులో ఇంప్లీడ్ కాలేమని కేంద్రం తేల్చి చెప్పడం జగనుకి చెంప పెట్టని… సంక్షేమం పేరుతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు.. ఇచ్చేది గోరంత-దోచుకునేది కొండంత అని ఆగ్ర‌హించారు. సంక్రాంతి పండుగను రైతులు ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి ఉంద‌ని… వచ్చిన పరిశ్రమలను కూడా తరిమేస్తున్నారు.. ఇవన్నీ మేధావులకు, పేటీఎం బ్యాచ్ లకు కనిపించడం లేదా? అని నిలదీశారు. సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడికి పాల్పడటాన్ని గర్హనీయమ‌ని ఆగ్ర‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version