విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45 వేలకు పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పారీశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో రోడ్డు కనెక్టివిటీ కీలకం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు నితిన్ గట్కరి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీ బలోపేతం చేస్తామని వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రానికి మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని ప్రకటించారు.