ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్లు లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నామని.. వెంటనే వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును కోరినట్లు తెలిపారు.
వర్గీకరణ పై కేంద్రా ,రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల వైఖరి తెలుసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. వర్గీకరణ జరిగితేనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు మందకృష్ణ. మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.