స్విగ్గీ, జొమాటో కు కేంద్రం బిగ్ షాక్..!

-

  • కేంద్రం లో ఉన్న బిజెపి సర్కార్ ప్రతి వస్తువు పై జీఎస్టీ వేస్తూ సామాన్యుడి పై భారం వేస్తున్న సంగతి తెలిసిందే. బట్టలు, ఆహారం పై కూడా కేంద్రం జీఎస్ విధిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లపై కూడా కూడా జీఎస్ విధించాలని నిర్ణయం తీసుకుంది. జోమాటో స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్ లను కూడా రెస్టారెంట్ లుగా పరిగణించి వాటి పై 5 శాతం జీఎస్టీ విధించే ప్రతి పాదనను తెరపైకి తెచ్చింది.

రేపు జరగబోయే జీఎస్టీ మండల సమావేశం లో దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది.రెస్టారెంట్ ల స్థానం లో ఫుడ్ డెలివరీ యాప్ ల నుండి జీఎస్ టీ వసూలు చేసి కేంద్రం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీని వల్ల వినియోగదారుల పై ఎలాంటి పన్ను భారం పడదు అని చెబుతున్నారు. కానీ ఫుడ్ డెలివరీ యాప్ లపై జీఎస్ టీ విధిస్తే మళ్ళీ ఆ యాప్ లు వినియోగదారుల నుండి వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో సామాన్యుడిపైనే భారం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version