కరోనా పరిహారం పై కేంద్రం గైడ్ లైన్స్..30 రోజుల్లో 50వేలు..!

-

కరోనా తో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని ఇటీవల కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో సుప్రీం కోర్టు కేంద్రం నిర్ణయం పై హర్షం వ్యక్తం చేసింది. కాగా తాజాగా కేంద్రం నష్టపరిహారం కు సంబందించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. కరోనా తో మరణించిన వారు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోపు 50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

పరిహారం చెల్లించాలంటే కరోనా కారణంగా మరణించినట్టు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా పరిహారాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అందించాలని పేర్కొంది. ఇదిలా ఉండగా కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు 50వేలు మాత్రమే ఇవ్వడం పై విమర్శలు వస్తున్నాయి. కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్స్ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news