బండి సంజయ్ కు ప్రాణహాని..రక్షణ కోసం కేంద్ర భద్రత !

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర భద్రత కల్పించాలని కేంద్రాన్ని బీజేపీ సీనియర్‌ నేత గూడూరు నారాయణ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం పోయిందని.. బండి సంజయ్‌కు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించాలని… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారును కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

జనగాం జిల్లాలోకి ప్రవేశించిన బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని.. అమిత్ షా పాదయాత్ర, బహిరంగ సభ విజయవంతమవడాన్ని జనగాం జిల్లా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంజయ్‌ కుమార్‌ పాదయాత్రకు భంగం కలిగించాలని కుట్ర చేశారని… ఇటీవల బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారని మండిపడ్డారు. బీజేపీ నేతలను టీఆర్‌ఎస్ నేతలు బెదిరించారు… పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగుతున్నా టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. బండి సంజయ్‌కు కేంద్ర భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news