మీ ఇంట్లో మొక్కలు వాస్తు ప్రకారమే ఉన్నాయా..?

-

ఇంట్లో మొక్కలు నాటితే ఇంటికి అందం రావడమే గాక మనసు ఆహ్లాదంగా ఉంటుంది. రోజంతా ఆ మొక్కలను చూస్తూ గడిపేయొచ్చు. పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాదు ఆ ప్రాంతమంతా ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఫలితంగా మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. కానీ మొక్కలు ఉండాల్సిన చోట కాకుండా ఓ దిశ లేకుండా ఉంటే మాత్రం ఆ ఇంటికి ఇబ్బందులు తప్పవట. ఎందుకంటే మొక్కలు కూడా వాస్తు ప్రకారమే నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి ఏ మొక్కలు ఏ దిశలో నాటాలి..?

తులసి, రావి, అరటి, త్రి దళం, వేప వంటి చెట్లను మనం దైవంగా భావించి పూజ చేస్తాం. ఈ మొక్కలు, చెట్లను పూజించడం వల్ల భోగభాగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతుంటాయి. వాస్తు ప్రకారం, ఇంటి లోపల ఉత్తరం లేదా తూర్పు దిశలో చిన్న అలంకారమైన మొక్కలను అదేనండి షోకేజ్ మొక్కలు నాటాలి. మీరు మీ ఇంటి లోపల పూల తోటను తయారు చేయాలనుకుంటే మాత్రం తూర్పు, తూర్పు-ఉత్తరం అంటే ఈశాన్య లేదా పడమర దిశను ఎంచుకోండి. మీరు మీ పూల తోటను ఈశాన్య మూలలో చేయాలనుకుంటే, తేలికపాటి పూల మొక్కలు లేదా తులసి, ఉసిరి మొదలైన తీగలను నాటొచ్చు.

వాస్తు ప్రకారం, ఉత్తర, తూర్పు దిశలో మామిడి చెట్టు, దక్షిణ ,ఆగ్నేయ కోణం మధ్యలో నేరేడు చెట్టు, అగ్ని దిశలో ఇంటి వెలుపల దానిమ్మ చెట్టును నాటడం శుభప్రదం. అదేవిధంగా ఇంటికి ఆగ్నేయ దిశలో చింతచెట్టు,  ఇంటి నుంచి పడమర దిశలో వాస్తు ప్రకారం రావి చెట్టును నాటడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం, ఏదైనా కోరికతో ఒక శుభ మొక్కను నాటితే ఆ కోరిక నెరవేరుతుందని కొందరి. శుభ తేదీ, శుభ నక్షత్రం గురించి పూర్తి శ్రద్ధ వహించాలి. శుక్ల పక్ష అష్టమి నుంచి కృష్ణ పక్ష సప్తమి వరకు చెట్ల పెంపకానికి శుభప్రదమని నమ్ముతారు.

ఉదయం నుంచి 11 గంటల వరకు మీ ఇంటిపై నీడ పడకుండా మీ భవనానికి అంత దూరంలో తూర్పున ఏదైనా శుభం కలిగించే చెట్టును నాటండి. ఫలించని మొక్క నీడ మీ ఇంటిపై పడితే, దాని వాస్తు దోషాల కారణంగా, మీరు తరచుగా కొన్ని సమస్యలను లేదా వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి చెట్టును తొలగించి వేరే చోట నాటాలి.

Read more RELATED
Recommended to you

Latest news