ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ శుభవార్త

-

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్దమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) ను మళ్లీ పెంచడానికి సిద్ధం అవుతోంది. అంతకు ముందు నెల ఆగస్టులో, లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 7 వ వేతన సంఘం కింద డీఏ పెంచింది పెంచింది.

జూలై 2021 నుండి అమలులోకి వచ్చే విధంగా DA ను 17% నుండి 28% కి పెంచింది కేంద్రం. ఇప్పుడు, తాజా నివేదికల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు DA ను మళ్లీ పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి ప్రస్తుతమున్న 28% నుండి 31% శాతానికి పెంచాల ని యోచిస్తోంది. ఇది నిజమైతే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతం డీఏ పెంపు నేరుగా జీతం భాగాన్ని ప్రభావితం చేస్తుంది. నివేదికల ప్రకారం, 50 లక్షల మందికి పైగా శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్లు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు.

జనవరి 2020 లో DA 4%, తరువాత జూన్ 2020 లో 3%, మరియు జనవరి 2021 లో 4% పెంచింది కేంద్రం. ఇప్పుడు, ఈ మూడు వాయిదాలు చెల్లించాలి. AICPI డేటా ప్రకారం, 7 వ వేతన సంఘం కింద జూన్ 2021 లో DA లో 3% పెరుగుదల ఉంటుంది. ఇది జరిగితే, మొత్తం DA 31% కి పెరుగుతుంది, దీనిని సెప్టెంబర్ జీతంతో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. జూన్‌లో డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెరిగితే, మొత్తం డీఏ 31%అవుతుంది. ఇప్పుడు రూ .18,000 ప్రాథమిక వేతనంపై, మొత్తం వార్షిక డియర్‌నెస్ అలవెన్స్ రూ. 66,960 అవుతుంది. కానీ వ్యత్యాసం విషయానికి వస్తే వార్షిక జీతం పెరుగుదల రూ. 30,240 అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news