వద్దన్నా..సమంత వెంట పడుతున్న అక్కినేని నాగ చైతన్య ?

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత.

Naga-Chaitanya-Samantha

ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది. అలాగే తన అన్నీ సోషల్ మీడియాలోనూ.. అక్కినేని నాగచైతన్యను ఆన్ ఫాలో చేసింది సామ్.

అక్కినేని నాగచైతన్య మాత్రం.. అలా చేయకుండా… హీరోయిన్ సమంతనే ఫాలో అవుతున్నాడు. కానీ అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీని మాత్రం సమంత ఫాలో అవుతుంది. అయితే సమంత తరహాలో… వెళ్లకుండా ఆమెని నాగచైతన్య ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం హీరోయిన్ సమంత యశోద సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version