ఇదేం వింతరా బాబు.. కాళ్ల తో నిలబడిన చేప..వైరల్..

-

ప్రకృతిలో ఎన్నో వింతలున్నాయి..ఈ అందమైన ప్రపంచంలో ప్రతిదీ ఒక విశేషంగా చెప్పవచ్చు..కొన్ని కొన్ని సార్లు ప్రకృతిలో జరిగే వింతలను చూస్తె మైండ్ బ్లాక్ అవ్వడమే కాదు..మన కళ్ళను మనమే నమ్మలేము.కొన్ని సార్లు  ఈ ప్రపంచంలో ఇలాంటివి ప్రపంచంలో నిజంగా ఉన్నాయా అని కూడా ఆలోచిస్తాం..అలాంటి అనేక వింత జీవులు భూమి మీద, సముద్రంలో ఉన్నట్లు తరచుగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సముద్రపు లోతుల్లో మనుషులు ఇంతకు ముందెన్నడూ చూడని వింతలు తరచూ కనిపిస్తుంటాయి.

అందుకే సముద్రం లోతు, మనిషి మనసు ఎవ్వరికీ తెలియదని.. ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని అంటారు. వస్తావం చెప్పాలంటే.. చాలా రకాల చేపలను చూసి ఉంటారు.అయితే ఎప్పుడైనా కాళ్లతో నడిచే చేపను.. లేదా నిలుచున్న చేపలను చూశారా.. అది ఎలా సాధ్యం..చేపలకు మొప్పలు కూడా ఉండేవి.. కాళ్ళు ఎక్కడ ఉంటాయని ఆలోచిస్తున్నారా.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ను ఒకసారి చూడండి..

ఈ వీడియోలో మంచు మీద ‘పాదాల’ మీద నిలబడి ఉన్న ఒక పెద్ద చేప కనిపిస్తుంది. సర్వ సాధారణంగా చేపలు నీటిలో మొప్పల సాయంతో ఈదుతాయి. ఊపిరిని పీల్చుకుంటాయి. అయితే అందుకు భిన్నమైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. చేప ‘పాదాల’ మీద హాయిగా నిలబడి ఉంది. ఇది చేప లేక మరేదైనా వింత సముద్ర జీవా అనేది ఎవరికీ తెలియదు..

కానీ, చూడడానికి చేపలా అనిపిస్తుంది. చేపలకు కాళ్లు ఉండవు.. వైరల్ వీడియోలో ఉన్న చేపకు కాళ్లు ఉన్నాయి. చేపకు పాదాలు ఎలా పెరిగాయనేది అంతుచిక్కని రహస్యం. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.. మీరు నిజంగా ఇలాంటి వింతను ఎప్పుడూ చూసి ఉండరు..ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది దేవుని సృష్టి.. దేవుడి చేపని అంటే.. మరొకొందరు అసలు ఇది ఏ జీవి అని ప్రశ్నలు కురిపిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news