రాజీవ్ కనకాలతో బ్లాక్ అండ్ వైట్, వరుణ్ సందేశ్ తో ప్రియుడు లాంటి చిత్రాలను గతంలో నిర్మించిన నిర్మాత ఉదయ్ కిరణ్ కు టాలీవుడ్ లో చాలా అనుభవం ఉంది. ఆయన హిమాలయ స్టూడియో మాన్షన్స్ పతాకంపై తాజాగా నిర్మించిన సినిమా ‘ఛలో ప్రేమిద్దాం”. సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటించారు. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న `ఛలో ప్రేమిద్దాం` సినిమా ఈ నెల 19న థియేటర్ రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ… ప్రియుడు సినిమా టైమ్ నుంచే దర్శకుడు సురేష్ శేఖర్ పరిచయం. అతను చెప్పిన కథ బాగా నచ్చి `ఛలో ప్రేమిద్దాం`సినిమాను నిర్మించాం. నేటి ట్రెండ్ కు అనుగుణంగా సినిమా ఉంటుంది. లవ్ స్టోరి ఫ్లస్ థ్రిల్లర్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఎక్కడా ఇబ్బంది లేకుండా `ఛలో ప్రేమిద్దాం` రూపొందింది. ఒక పాట దుబాయ్ లో షూట్ చేశాం. ప్రొడక్షన్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నవంబర్ 19న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో 200కు పైగా థియేటర్ లలో `ఛలో ప్రేమిద్దాం`మీ ముందుకు వస్తుంది. చూసి ఆదరించండి. కరోనా ముందు కరోనా తర్వాత అనేలా సినిమా పరిస్థితి మారిపోయింది. ఒకప్పటిలా పరిశ్రమ లేదు. ఇప్పుడున్న సిట్యువేషన్స్ కు అనుగుణంగా నిర్మాతలమైన మేము మారుతున్నాం. ఇకపై మా బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తాం. అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ…భీమ్స్ అంటే బీట్, ఫోక్ సాంగ్స్ విని ఉంటారు. కానీ `ఛలో ప్రేమిద్దాం`చిత్రంలో నా నుంచి కొత్త టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేను బాగా చేయననే అపవాదు కూడా ఈ సినిమాతో పోతుందని ఆశిస్తున్నా. అంత బాగా పాటలు, నేపథ్య సంగీతం కుదిరాయి. ఒక భారీ చిత్రానికి పెట్టిన బడ్జెట్ ను `ఛలో ప్రేమిద్దాం`పాటలకు నిర్మాత ఇచ్చారు. ఐదు పాటలు పంచ భూతాల్లా అంత బాగా వచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఎంబీఏ, ఎంసీఏ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. లిరిసిస్ట్స్ సురేష్, దేవ్ పవార్ మంచి సాహిత్యాన్ని అందించారు. ఇక రెగ్యులర్ గా నా సినిమాలు ఉంటాయి. త్వరలో రవితేజతో ధమాకా అనే సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను. అన్నారు.
శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్, అనంత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; పాటలుః సురేష్ గంగుల, దేవ్, ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క; ఆర్ట్ డైరక్టర్ః రామాంజనేయులు; పీఆర్వోః రమేష్ చందు, నగేష్ పెట్లు, ఫైట్స్ః నభా-సుబ్బు, కొరియోగ్రఫీః వెంకట్ దీప్; సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి; నిర్మాతః ఉదయ్ కిరణ్, రచన-దర్శకత్వంః సురేష్ శేఖర్ రేపల్లె.