ఢిల్లీలో సీఈసీతో ముగిసిన చంద్రబాబు భేటీ

-

రాష్ట్రంలో 15 లక్షల ఓట్లలో అవకతవకలు జరిగాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్ల విషయమై సీఈసీతో టీడీపీ చీఫ్ చంద్రబాబు సోమవారంనాడు భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓట్ల నమోదులో చోటు చేసుకున్న అవకతవకలపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆయన ఈసీని కోరారు.ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఎఎస్ లను పంపి ఓటర్ల నమోదులో అవకతవకలను సరి చేయాలని ఆయన ఈసీని కోరారు.

ఓట్ల తొలగింపుపై కోర్టుకు కూడ వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరించి, భయపెట్టి తమ పార్టీ అభ్యర్థులను ఉపసంహరింపచేశారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింత సమస్య వచ్చిందన్నారు.ఒక పార్టీ ఓట్లు తొలగించాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదన్నారు.

“వీళ్లు పంచాయతీ సచివాలయం అనే ఒక వ్యవస్థను తీసుకువచ్చారు. ఇందులో ఉండే 1.30 లక్షల మందికి బీఎల్వో విధులు, ఎన్నికల విధులు కేటాయిస్తున్నారు. వాలంటీర్ల సాయంతో డేటా సేకరించి ప్రైవేటు ఏజెన్సీకి పంపిస్తున్నారు. ఆ సేకరించిన సమాచారం ద్వారా టీడీపీ, ఇతర పార్టీల ఓటర్లను గుర్తించి వారిని తొలగిస్తున్నారు. వీటన్నింటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. దొంగ ఓట్లు చేర్చడం, ఉన్న ఓట్లు తొలగించడం, చనిపోయినవారిని జాబితాలో చేర్చడం… ఇలా 15 లక్షల ఓట్లను తారుమారు చేసినట్టు సాక్ష్యాధారాలతో సహా ముందుకు వచ్చాం. వీటన్నింటినీ ఓ సీడీ రూపంలో పొందుపరిచాం. సున్నా డోర్ నెంబరుతో పెద్ద సంఖ్యలో ఓట్లను జాబితాలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే ఈ అక్రమాలను సరిదిద్దాలని కోరాం” అని చంద్రబాబు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version