నీ వద్ద పోలీసులున్నారని అనుకుంటున్నావేమో…. వాళ్లు రెండ్రోజులు : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం చిత్తూరు జైల్లో కుప్పం టీడీపీ నేతలతో మాట్లాడుతూ.. ఇటీవల తాను పర్యటనకు వస్తే టీడీపీ నేతలంతా తన వెంటే ఉన్నారని వెల్లడించారు. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తే, తిరిగి వారిపైనే పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు. మీరేం పోలీసులండీ… ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని వెల్లడించారు. పోలీసులు అందరినీ తాను అనడంలేదని, వారిలో 10 శాతం మంది తప్పుడు మార్గంలో వెళుతున్నారని విమర్శించారు. వాళ్ల లెక్కలు తాను రాసిపెడుతున్నానని అన్నారు. నమ్మకద్రోహులు అని పేర్కొన్నారు. పోలీసుల్లో 90 శాతం మంది మంచివారేనని, కానీ ఏమీ చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఆయుధాలున్నాయంటూ తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని, ఆయుధాలు ఉంటే పులివెందులలో ఉండొచ్చేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

Lok Sabha Elections 2019: N Chandrababu Naidu Says May Be Arrested In A Day  Or Two, Will Go To Jail But Won't Be Cowed

కేసులు పెడితే భయపడి పారిపోతామని జగన్ అనుకుంటున్నాడని, కానీ అది ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. బాబాయి హత్య జరిగితే గుండెపోటు అంటాడని, నారాసుర రక్తచరిత్ర అంటూ నేనే చంపానని ప్రచారం చేశారని మండిపడ్డారు జగన్ సీబీఐనే బెదిరిస్తున్నాడని, సీబీఐ వద్ద ఆయనపై 11 కేసులు ఉన్నాయని, సీబీఐ ఆ కేసుల బటన్ ను నొక్కితే ఈ జగన్ ఎక్కడుంటాడు? అని అన్నారు. నీ వద్ద పోలీసులున్నారని అనుకుంటున్నావేమో…. వాళ్లు రెండ్రోజులు ఉంటారు, మూడోరోజున నీ పోలీసులే నిన్ను అరెస్ట్ చేస్తారు అని స్పష్టం చేశారు.