ఏపీ కూటమి నేతలకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ నెలలో అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై టిడిపి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.

త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను విపరీతంగా మోసం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. కేంద్రం ఇచ్చే సాయంతో కలిపే రైతులకు రూ. 20 వేలు చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంతో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.