టీడీపీలోకి రేవంత్..బాబు స్కెచ్ ఛేంజ్!

-

మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అవుతుంది. టి‌డి‌పి అధినేత చంద్రబాబు..తెలంగాణపై కూడా కాస్త ఫోకస్ పెడుతున్నారు. అయితే గత రెండు ఎన్నికల్లో టి‌డి‌పి చావు దెబ్బతినడం..ఆ పార్టీని లీడర్లు, క్యాడర్ విడిచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ కథ ముగింపు దశకు వచ్చింది. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు..కాసాని జ్ఞానేశ్వర్‌ని పార్టీలోకి తీసుకోవడం, ఆయన్ని తెలంగాణ అధ్యక్షుడుగా నియమించారు.

కాసాని అధ్యక్షుడు అయ్యాక పార్టీ శ్రేణులని యాక్టివ్ చేశారు. ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ చేశారు. పార్టీని ప్రక్షాళన చేశారు. మళ్ళీ పార్టీని యాక్టివ్ అయ్యేలా చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాసాని పని మొదలుపెట్టారు. ఇంటింటికి తెలుగుదేశం పేరిట కార్యక్రమం స్టార్ట్ చేశారు. చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు..టి‌డి‌పిని వదిలేసి వెళ్ళిన నేతలని మళ్ళీ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా కాసాని..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టి‌డి‌పిలోకి రావాలని ఆహ్వానించారు. రేవంత్‌కు టి‌డి‌పి  అనేది తల్లి లాంటిది అని, ఆయనకు టీడీపీపై ప్రేమ ఉందని, అందుకే పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

అటు చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగానే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయం చేస్తూనే..దాని ద్వారా ఏపీలో లబ్ది పొందేలా స్కెచ్ వేశారని తెలిసింది. వాస్తవానికి తెలంగాణలో టి‌డి‌పి బలం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు కొద్దో గొప్పో బలం పెంచిన..ఎన్నికల్లో ఒకటి, రెండు సీట్లు గెలిచే బలం కూడా రాకపోవచ్చు.

కాకపోతే టి‌డి‌పి కొన్ని సీట్లలో ఓట్లు చీలవచ్చు..అలా చేసి అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్‌ని దెబ్బకొట్టవచ్చు..అదే సమయంలో బి‌జే‌పి సైతం టి‌డి‌పితో పొత్తు కోసం ముందుకు రావచ్చు. చూడాలి మరి బాబు ప్లాన్స్ ఏ మేర వర్కౌట్ అవుతాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version