మనసులోంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ : చంద్రబాబు

-

టీడీపీ 41వ ఆవిర్భావ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు ఈరోజు. జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ , మార్చి 29 రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు అని అన్నారు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని వెల్లడించారు. తెలుగువాళ్ల కోసం ఏంచేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక మీటింగ్ పెడితే, ఆ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయి భారీగా తరలి వచ్చారని, దాంతో ఈ రాష్ట్రం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ నేత చంద్రబాబు తెలియచేశారు.

Chandrababu Naidu warns of revolt against Jagan's govt | Deccan Herald

“మనసులోంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఏది ప్రిపేర్ అయి చెప్పలేదు. తెలుగు జాతి నాది. ఆ తెలుగు దేశం కోసమే పార్టీ పెడుతున్నా… దాని పేరే తెలుగుదేశం అని అప్పటికప్పుడు తెలియచేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్” అని ఎన్టీఆర్ గారిని కీర్తించారు. పసుపు రంగు శుభానికి చిహ్నమని, అందుకే నాడు ఎన్టీఆర్ ఆ విషయాన్ని దృష్టి పెట్టుకున్నారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ జెండాలో నాగలి రైతు చిహ్నం, రాట్నం కార్మికుల చిహ్నం, గుడిసె పేదవాడికి చిహ్నం అని ఆ జెండా గురుంచి వివరించారు చంద్రబాబు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగు ప్రజంలదరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యక్తపరిచారు చంద్రబాబు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news