వైసీపీ ఎమ్మెల్యేలు సూపర్ స్పైడర్లు అయ్యారు..!

కార్మూరి నాగేశ్వరరావుకు కరోనా వచ్చినా మాస్కులు పెట్టుకోకుండా మంత్రుల తిరుగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒక్కరికి కూడా మాస్కులు లేవు.. శానిటైజేషన్ చేసుకోవడం లేదు అంటూ వారంతా ఎమ్మెల్యేలంతా సూపర్ స్ప్రెడర్లుగా మారారని ఆయన కామెంట్ చేసారు. ఇక రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్న ఆయన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామనుకు లేఖ రాశారని అన్నారు.

 

జే ట్యాక్స్ కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మట్టి, ల్యాండ్, లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందని అన్నారు. కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారన్న చంద్రబాబు తప్పులు చేసే పోలీసులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. అబ్దుల్ సలాం ఘటనలో పోలీసులు జైళ్లకు వెళ్లారని అన్నారు.  జమిలీ ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వం ఉండదన్న ఆయన అందుకే జాగ్రత్తగా ఉండాలని అన్నారు.