పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ సభ పెట్టి చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.
వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ ను తిడుతున్నారు? ఎందుకు అంత భయం? ఎందుకు అంత పిరికితనం? అని ఎద్దేవా చేశారు. అధికారం ఉందన్న అహంకారం మంచిది కాదు. ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని పేర్కొన్న ఆయన, సేవాభావం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలన్నారు.